నీట్ 2021 దరఖాస్తు: నీట్ పరీక్ష తేదీ, సమయం, ప్యాటర్న్ వివరాలు
NEET 2021 exam: NEET 2021 application last date: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ కమ్ టెస్ట్ యూజీ 2021 (NEET UG 2021) సెప్టెంబర్ 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నీట్ 2021 పరీక్ష దరఖాస్తు చివరి తేదీ గడువు నేటితో ముగిసిపోనుంది.
(Image credits: Twitter Photo)
ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోని వాళ్లకు ఈ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఉన్న గడువు సైతం నేటితో ముగియనుండటం గమనార్హం. (Image credits: Twitter Photo)
Changes in NEET application form 2021: నీట్ అప్లికేషన్ 2021 ఫారంలో మార్పులు: నీట్ అప్లికేషన్ ఫామ్ 2021 లో (NEET application form 2021) మార్పులుచేర్పులు చేసుకోవాలని భావించే అభ్యర్థులకు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు అవకాశం ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. (Image credits: Twitter Photo)
NEET Exam 2021 fee payment options: నీట్ పరీక్ష 2021 ఫీజు చెల్లింపు వివరాలు: కొత్తగా ఫీజు చెల్లించే వారు లేదా ఇదివరకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అదనపు ఫీజు చెల్లించాల్సి ఉన్న వారు క్రెడిట్ / డెబిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / యూపీఐ, పేటీఎం యాప్ (Credit/Debit Card/ Net Banking/UPI and PAYTM) ద్వారా చెల్లించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. (Image credits: Twitter Photo)
NEET admit card download: నీట్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ నీట్ పరీక్ష 2021 కి మూడు రోజుల ముందు నీట్ అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ స్పష్టంచేసింది.
(Image credits: PTI)
NEET Exam 2021 date and time: నీట్ పరీక్ష తేదీ, సమయం : మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు గంటల పాటు నీట్ ఎగ్జామ్ జరగనుంది.
(Image credits: Twitter Photo)
NEET Exam pattern 2021: నీట్ పరీక్ష 2021 విధానం: నీట్ పరీక్ష నిడివి 180 నిమిషాలు కాగా మొత్తం 180 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్వన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయనే సంగతి తెలిసిందే. NEET PG Exam 2021 (Image credits: Twitter Photo)
Also read : పివి సింధు ఫ్యామిలీ అండ్ పేరెంట్స్: అక్క కొడుకుతో పివి సింధు ఆటలు
Also read : Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి
Also read : BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్, ధర చూస్తే షాక్