Neha Shetty: పట్టు చీరలో మెరిసిపోయిన నేహా శెట్టి…ఏడారిలో ట్రెడిషనల్ అందాలు..
మోడలింగ్‌తో తన కెరీయర్ ని ప్రారంభించిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. అంతేకాకుండా తను మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.
కాగా దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం ముంగారు మలే 2 తో సినిమాలలోకి తెరంగేత్రం చేసింది ఈ హీరోయిన్. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నేహా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి.
పూరి జగన్నాధ్ దర్శకత్వం మెహబూబా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ హీరోయిన్. ఈ సినిమా కోసం ఆమె తెలుగు భాష నేర్చుకున్నది.
ఇక ఆ తరువాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ అఖిల్ హీరోగా చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చిన్న పాత్రతోపాటు గల్లీ రౌడీలో హీరోయిన్ గా చేసింది.
అయితే ఈ సినిమాలు ఏవి ఆమెకు తెచ్చిపెట్టని పేరు సిద్దు జొన్నలగడ్డతో తీసిన డీజే టిల్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్ర హైలెట్ గా నిలిచింది.
ప్రస్తుతం రెండు, మూడు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో.. అందమైన చీరలో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ అక్కట్టుకుంటున్నాయి.