Children`s behaviour: పిల్లల ముందు అనకూడని మాటలు ఏంటో తెలుసా ?
పిల్లల ఎదుగుదల ఇంట్లోనే మొదలవుతుంది. పిల్లల మొదటి గురువు తల్లితండ్రులే. పిల్లలు ఇంట్లో పెద్దవాళ్లను చూసి ప్రభావితమవుతారు. అందుకే పిల్లలతో ఆచి తూచి మాట్లాడాలి.
ఇంట్లో తల్లితండ్రులు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు తెలివిగా, చాలా జాగ్రత్తగా స్పందించాలి. ఎలాంటి పదాలు పిల్లల ముందు మాట్లాడకూడదో తెలుసుకోండి.
పిల్లలను ఎప్పుడు కూడా వాళ్ల తోబుట్టువులతో గాని, ఇతర పిల్లలతో గాని పోల్చడం మంచి ఆలోచన కాదు. ఇది వారి ఆత్మగౌరవానికి హాని కలిగిస్తుంది. అసూయను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో వారిపై అయిష్టత, ద్వేషం కలిగేలా చేస్తుంది. అందుకే పిల్లలను ఎవ్వరితోనూ పోల్చరాదు.
నీకు ఇది సాధ్యపడదు, నువ్వు చేయలేవు లాంటి మాటలు అనకూడదు. అలా అనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. ఎన్నిసార్లైనా నేర్చుకొని, ప్రయత్నించే అవకాశం వారికి ఇవ్వండి.
పిల్లలలో ఆడ, మగ బేధం చూపించకూడడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడామగా అనే తారతమ్యాలు లేకుండా అందరూ అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. అలా మీ పిల్లలను కూడా ప్రొత్సహించండి.
పిల్లలు ఏది అడిగినా లేదు, కాదు, కూడదు అనే పదాలు సాధ్యమైనంత వరకు ఉపయోగించడం ప్రమాదకరం. ఊరికే అలాంటి మాటలు వింటుంటే వారి విశ్వాసం కోల్పోయి, వారిలో భయం పెరుగుతుంది.
పిల్లలు మీరు చెప్పింది వినట్లేదని, మీతో మాట్లాడవద్దు లాంటి మాటలు అనకూడదు. అలా అనడం ద్వారా వారిలో ఆందోళన కలగవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో మీతో మాట్లాడటానికి కూడా వారు భయపడవచ్చు.
పిల్లలు ఎప్పుడు కూడా పెద్దలలా ప్రవర్తించలేరు. కానీ పిల్లలను ఎప్పుడు కూడా 'చిన్న పిల్లల్లా ప్రవర్తించకు' అని అనకూడదు. వారి పసితనాన్ని ఆస్వాదించనీయాలి. కానీ మీరు ఇంకా చిన్న పిల్లలు కాదు అని బాధపెట్టకూడదు. పిల్లలని నిరుత్సాహపరచకుండా, మేమున్నాం అనే ధైర్యాన్ని వారిలో నింపాలి.
Also read : Skin and hair care tips: అందమైన చర్మం, జుట్టు కోసం సింపుల్ టిప్స్
Also read : Food items in breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా ? అయితే రిస్కే..
Also read : Health tips: శీతాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఇవి తింటే రిస్కే