ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం అనేదే చాలా మందికి తెలుసుకానీ.. ఆ బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అనే విషయంపై మాత్రం చాలామందికి అవగాహన లేదు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం అనేదే చాలా మందికి తెలుసుకానీ.. ఆ బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అనే విషయంపై మాత్రం చాలామందికి అవగాహన లేదు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. కొన్నిరకాల ఫుడ్స్‌ని బ్రేక్‌ఫాస్టులో తీసుకోకపోతేనే మంచిది అని వారు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఆ బ్రేక్‌ఫాస్ట్ మెనూ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉదయం పూట కొంతమందికి వివిధ పండ్ల రసాలతో తయారు చేసిన జామ్‌తో పాటు బ్రెడ్ వంటివి అల్పాహారంగా తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే, ఈ జామ్స్ నిల్వ ఉండటానికి వీలుగా అందులో తక్కువ మొత్తంలో పండ్ల రసం ( Fruit juices ), అధికమోతాదులో చక్కెరను మిక్స్ చేస్తారు. ఫలితంగా అవి తీసుకున్న వారు స్థూలకాయం, మధుమేహం ( Obesity, Diabetes ) లాంటి అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన ప్రమాదం ఉందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడం కోసం ఎక్కువ టైమ్ పట్టకుండా సింపుల్‌గా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కొంత మందికి టోస్ట్ కానీ లేదా కాఫీ లాంటివి ఇష్టపడుతుంటారు. ఇంకొంత మంది రొట్టె తినడం చేస్తుంటారు. అయితే అలాంటివి ఆరోగ్యానికి హానీ చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటి స్థానంలో తక్కువ కొవ్వు ఉన్న కూరగాయలు లేదా జున్నుతో మల్టీగ్రెయిన్ బ్రెడ్‌ను ( Multigrain bread ) అల్పాహారంగా తీసుకోవడం మంచిది అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
కొంతమందికి ఉదయం పూట బ్రేక్‌ఫాస్టులో పరాట, రోటి వంటి వాటితో అంచుకు పెరుగు తినడం అలవాటుగా ఉంటుంది. అయితే, పెరుగులో ( Curd ) ఉండే చక్కర నిల్వలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. మరీ ముఖ్యంగా స్థూలకాయం, మధుమేహంతో బాధపడేవారికి ఈ అలవాటు అసలే మంచిది కాదట.
బ్రేక్ ఫాస్టులో కొంతమంది పాన్ కేక్‌లు ( Pan cakes) తినే అలవాటు ఉంటుంది. అయితే, అవి ప్రాసెస్ చేసిన ఫుడ్ కావడంతో పాటు అవి నిల్వ ఉండేందుకు అందులో మిక్స్ చేసే ఇన్‌గ్రీడియెంట్స్ కారణంగా స్థూలకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు.