Whiskey Ice Cream: విస్కీతో ఐస్‌క్రీమ్ రుచి చూశారా? రుచి చూస్తారంటే జైలుకే!
Whiskey Ice Cream: చల్ల చల్లగా ఎంతో రుచిగా ఉండే ఐస్‌క్రీమ్‌ను ప్రతిఒక్కరూ ఇష్టపడుతుంటారు. కొత్త కొత్త ఫ్లేమ్‌లు.. కొత్త రుచుల్లో ఐస్‌క్రీమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
Whiskey Ice Cream: కొత్తగా మద్యంతో కూడా ఐస్‌క్రీమ్ తయారుచేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ ఇలాగే మద్యంతో చేసింది.
Whiskey Ice Cream: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను దయాకర్ రెడ్డి, శోభన్ నిర్వహిస్తున్నారు.
Whiskey Ice Cream: పార్లర్ నిర్వాహకులు ఐస్‌క్రీమ్‌లో 100 పేపర్ విస్కీ వేసి తయారుచేస్తున్నారు. ఆ ఐస్‌క్రీమ్ రుచికరంగా.. మత్తుగా ఉండడంతో ఐస్‌క్రీమ్ ప్రియులు తెగ ఇష్టపడుతున్నారు.
Whiskey Ice Cream: ఒక లీటర్ ఐస్‌క్రీమ్‌లో 60 ఎంఎల్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. ఈ ఐస్‌క్రీమ్ ధర భారీగా పెంచి అమ్ముతున్నారు.
Whiskey Ice Cream: విపరీతంగా డిమాండ్ రావడం.. విస్కీ ఐస్‌క్రీమ్ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం ఎక్సైజ్ శాఖ దృష్టికి వచ్చింది.
Whiskey Ice Cream: నిబంధనలకు విరుద్ధంగా విస్కీతో ఇలా ఐస్‌క్రీమ్ చేయడం నేరంగా గుర్తించారు. వెంటనే పార్లర్‌పై చర్యలు తీసుకున్నారు.
Whiskey Ice Cream: మద్యం కలిపిన 11.50 కిలోల ఐస్‌క్రీమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పార్లర్ యజమానులను అరెస్ట్ చేశారు.