New Kia Ev6 2025: 528 కిలోమీటర్ల మైలేజీతో కొత్త Kia కారు వస్తోంది.. ఫీచర్స్ లీక్!
ఎలక్ట్రిక్ Kia EV6 కారుకు సంబంధించిన టీజర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది.
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ కాబోయే Kia EV6 కారు డిజైన్‌లో అనేక మార్పులు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బ్యాక్ సైడ్‌లో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు ఈ కారులోని హెడ్‌లైట్, టెయిల్‌లైట్ అద్భుతమైన టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు ప్రత్యేకమైన గ్రిల్, ప్రీమియ డిజైన్ బంపర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్ ప్రత్యేకమై సెఫ్టీ ఫీచర్స్‌తో రాబోతోంది.
ఈ Kia EV6 కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 528 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో పాటు ఈ కారులో ప్రత్యేకమై డ్రైవింగ్ మోడ్స్ కూడా లభించనున్నాయి.
ఇక ఈ Kia EV6 ఎలక్ట్రిక్ కారు SUV 50 kWh DC ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కారు 1 గంట 13 నిమిషాలలో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకునే ప్రత్యేకమైన ఫీచర్‌తో అందుబాటులోకి వస్తోంది.
ఈ Kia EV6 కారు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో 14 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ లభించబోతున్నాయి.