Petrol & Diesel Price Hike: సామాన్యులకు భారీ షాక్‌.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Petrol & Diesel Price Hike: కర్నాటక ప్రభుత్వం సామాన్యులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ చర్యకు చేపట్టింది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 15, 2024, 08:44 PM IST
Petrol & Diesel Price Hike: సామాన్యులకు భారీ షాక్‌.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Petrol & Diesel Price Hike: కర్నాటక ప్రభుత్వం సామాన్యులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ చర్యకు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2,500 నుంచి 2800 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. ఈ సందర్భంగా పెట్రోల్‌ లీటరుకు రూ.3, డీజిల్‌ ధరలు లీటరుకు రూ. 2 పెరగనున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సేల్స్‌ ట్యాక్స్‌ 3.92, 4.1 శాతం పెరిగిందని రాష్ట్ర ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేశాయి. 

ఇదీ చదవండి: వావ్.. జీ7 సదస్సులో "మెలోడి'' మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..

2011 నవంబర్‌ 4న రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ రేట్లను 25.92, 14.34 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ట్యాక్స్‌ రేటులు పెరగడంతో 29.84, 18.44 శాతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి. లోక్‌ సభ ఎన్నికల్లో 28 సీట్లకు కాంగ్రెస్ కేవలం 9 సీట్లకే పరిమితమైంది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌ సామాన్యుల జేబుకు చిల్లు పడేలా చేసింది. ఈ పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చూసి బీజేపీ పార్టీ సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. మొదటి త్రైమాసికంలో కర్నాటక ప్రభుత్వం ఆదాయం వసూళ్ల మందగింపుతో  ప్రభుత్వం హామీలను నెరవేర్చేందుకు ఇలా వనరుల సమీకరణకు చర్యలు చేపడుతోంది.

 

 

 

ఇదీ చదవండి: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..

ఇదిలా ఉండగా పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు మాత్రమే కాదు వీటి తయారీకి ఉపయోగపడే ఉత్పత్తులపై కూడా భారం పడనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ రెవెన్యూ రూ.2,800 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు పెంచనుంది. ధరల సర్దుబాటు నేపథ్యంలో ఇలా పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చిందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది.నిజానికి లోక్‌ సభ ఎన్నికల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయని భావించారు. కానీ, అనూహ్యంగా వీటి ధరలను పెంచేశాయి. ఈ రేట్ల పెంపు తర్వాత కర్నాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.. లీటరు పెట్రోల్‌ ధర రూ. 102.84, డీజిల్‌ ధర లీటరుకు రూ. 88.95 కు చేరింది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News