New Tata Sumo Price: మళ్లీ మాస్ లుక్‌లో Tata Sumo వస్తోంది.. అప్‌గ్రేడ్ డిజైన్ చూస్తే ఆశ్చర్యమే..
ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాల్లో టాటా సుమో కనిపిస్తున్నాయి. ఈ కారు దాదాపు రెండు దశాబ్ధాల పాటు విక్రయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని పొందింది. ఈ సుమో దాదాపు 2020 వరకు 26 సంవత్సరాల పాటు అద్భుతంగా విక్రయాలు జరిగాయి. అయితే ఈ కారు మరోసారి మార్కెట్‌లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ టాటా సుమో (Tata Sumo) మార్కెట్‌లోకి విడుదలైతే.. మహింద్రా కంపెనీకి సంబంధించిన పలు కార్లతో పోటీ పడనుంది. అలాగే ఈ కారు గతంలో విడుదలైన సఫారీ కారును పోలి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో రాబోయే సుమో అప్‌గ్రేడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
అలాగే ఈ టాటా సుమో (Tata Sumo) కారు అద్భుతమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది రెండు ఇంజన్ వేరియంట్స్‌లో విడుదల కానుంది. ఇందులో డీజిల్ ఇంజన్ 1.5-లీటర్‌తో రానుంది. అలాగే ఈ కారు లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని అందించే అవకాశాలు ఉన్నాయి,
ఇక New Tata Sumoకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని ఎక్స్-షోరూమ్ రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా దీని హైఎండ్ ధర రూ .10 లక్షలు ఉండనుంది. అయితే ఇది 9 సీటర్ ఆప్షన్‌లో రానుంది.
ఇది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో టాటా దీనిని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన పవర్ విండోస్ ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది.