Free Bus Scheme: ఏపీ మహిళలకు న్యూ ఇయర్ గిఫ్ట్.. ఉచిత బస్సు అమలు అప్పటి నుంచే!

ఎన్నికల హామీ: ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకం హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.

ఉప సంఘం: మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఉత్తర్వులు: ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
సభ్యులు వీరే: మంత్రివర్గ ఉపసంఘంలో హోం, రవాణా శాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా నియమించింది.
సంక్రాంతి తర్వాత: ఉచిత బస్ పథకం అమలు తీరును పరిశీలనకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు.
అప్పటి నుంచే: కొన్ని వారాలు పరిశీలన చేపట్టిన అనంతరం ఉచిత బస్సు పథకం అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.సంక్రాంతి పండుగ తర్వాత ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చేలా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.