New year Party Recipe: న్యూ ఇయర్ స్పెషల్ ..రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్స్..ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసుకోండి

Tue, 31 Dec 2024-12:23 pm,

New year Party Recipe: చికెన్ కబాబ్స్ అందరికీ ఇష్టమే ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఇంట్లోనే సులభంగా చికెన్ కబాబ్స్ తయారు చేసి మీ పిల్లలకు తినిపించండి. ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే రుచికి ఫిదా అయిపోతారు. రుచిలో ఏమాత్రం తేడా రాకుండా రెస్టారెంట్ రుచికి ఏమాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేయవచ్చు. చికెన్ కబాబ్స్ తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. 

కావాల్సిన పదార్థాలు :

చికెన్ కీమా - అరకేజీ, తరిగిన ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు, చాట్ మసాలా - 1 టీస్పూన్, కారం - 1 టేబుల్​స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 4, గరంమసాలా - అరటేబుల్​స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, గుడ్డు - 1, మిరియాలపొడి - 1 టేబుల్​స్పూన్, కొత్తిమీర తరుగు - 2,  టేబుల్​స్పూన్లు, పుదీనా తరుగు - 2 టేబుల్​స్పూన్లు, బటర్ - 2 టేబుల్​స్పూన్లు  

తయారీ విధానం  ఇప్పుడు మిక్స్ బౌల్ తీసుకుని అందులో చికెన్ కీమా చేసుకోవాలి. లేదంటే చికెన్ షాపులోనే కీమా కొట్టించుకుని తెచ్చుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కారం, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేయాలి. దానిపై మూతపెట్టి అరగంటసేపు అలానే వదిలేయాలి.   

తర్వాత అందులో గడ్డు సొనను వేసి కలపాలి. గుడ్డు ఇష్టం లేకుంటే టీస్పూన్ శనగపిండి కూడా కలుపుకోవచ్చు.   

తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.   

తర్వాత వాటిని అరగంటపాటు నీటిలో నానబెట్టుకున్న కాబాబ్ స్టిక్స్ కు అంటించుకుని పొడవుగా స్ప్రైడ్  చేసుకోండి.   

తర్వాత స్టౌపై మందపాటి పెనం పెట్టుకుని వేడి చేయాలి. వేడయ్యాక బటర్ వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఐదారు కబాబ్ స్టిక్స్ పెట్టి ఫ్లేమ్ మీద 8 నుంచి 10 నిమిషాల పాటు రెండు వైపులా కాల్చాలి.   

అవి క్రిస్పిగా మారిన తర్వాత తీసి వాటిపై కొద్దిగా కొత్తిమీర, పుదీనా , చాట్ మసాలా చల్లుకు సర్వ్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్స్ రెడీ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link