Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే
నిధి అగర్వాల్ అక్కినేని హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. సవ్యసాచి, మజ్ను వంటి సినిమాలతో టాలీవుడ్‌కు పరిచయం అయింది.
తమిళంలోనూ మంచి ఎంట్రీనే వచ్చింది. జయం రవి, శింబులతో చేసిన రెండు సినిమాలు సంక్రాంతికే విడుదలై మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్‌కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నిధికి డిమాండ్ పెరిగింది.
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో రాబోతోన్న హరి హర వీరమల్లు సినిమాలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నిధి ఒక్కసారిగా మూడు సినిమాలను సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో అగ్గిరాజేస్తోంది.