ఆగస్టులో Niharika నిశ్చితార్థం, కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్
లాక్‌డౌన్ టాలీవుడ్ సెలబ్రిటీలకు బాగా కలిసొచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా సినీ ప్రముఖుల వివాహాలు నిశ్చయం అవుతున్నాయి. ఈ క్రమంలో మెగా డాటర్, నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) పెళ్లి నిశ్చయమైంది. గుంటూరు యువకుడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లిని నిశ్చయించినట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడని తెలుస్తోంది.
చైతన్య హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో స్ట్రాటజిస్ట్‌గా, ప్లానర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాబోయే భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డతో దిగిన ఫొటోలను నిహారిక (Niharika Konidela With Chaitanya Jonnalagadda) తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక యాంకర్‌గా, నటిగానూ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో మెప్పించింది. తన పెళ్లికి సంబంధించిన విషయాలను పజిల్స్ మాదిరిగా ఒక్కోసారి ఒక్కో అప్‌డేట్ ఇస్తూ గత రెండు రోజులుగా నిహారిక ఫొటోలు షేర్ చేస్తోంది. ఆ ఫొటోలు మీకోసం.
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థాన్ని(Niharika Konidela Engagement) ఈ ఆగస్టులో నిర్వహించనున్నారు. అందుకు ముహూర్తం కోసం మెగా ఫ్యామిలీ ఎదురుచూస్తోంది. వివాహాన్ని ఈ ఏడాది చివరకల్లా జరిపించనున్నారు. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మెగా ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. (Niharika With Chaitanya Jonnalagadda Photos)
Image Credit: ఈ ఫొటోలను నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఖాతాల నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.