Nita Ambani Gift: చిన్న కోడలు రాధికకు అత్త నీతా అంబానీ మరో ఖరీదైన `ఆభరణం` గిఫ్ట్

లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నా కూడా అంబానీ కుటుంబం సంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తుండడం విశేషం. సంపన్న కుటుంబం సంప్రదాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తమ ఇంటికి కొత్త కోడలిగా వచ్చిన రాధికా మర్చంట్‌ను అత్త నీతా అంబానీ ఎంతో ప్రేమాప్యాయతలతో చూసుకుంటున్నారు.

కోడలు రాధికను నెత్తిన పెట్టుకుని నీతా అంబానీ చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాధికకు అత్త అత్యంత ఖరీదైన కానుక ఇచ్చినట్లు సమాచారం.
చిన్న కోడలు రాధిక మర్చంట్‌కు అత్త నీతా అంబానీ ఖరీదైన పచ్చలు, వజ్రాలతో పొదిగిన 'ఖందానీ హారం' బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఆ హారం అత్యంత ఖరీదైనవిగా ఫ్యాషన్ వర్గాలు చెబుతున్నాయి.
నీతా అంబానీ ఇచ్చిన ఖాందానీ హారం విలువ రూ.1.8 కోట్లు ఉంటుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఆ నగ అంబానీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆభరణంగా తెలుస్తోంది.
గతంలో కూడా అత్త నీతా అంబానీ తన చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు కొన్ని ఆభరణాలు బహుమతిగా ఇచ్చారు. ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఖరీదైన చోకర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఖాందార్ హారంతో మరో బహుమతి రాధిక మెడలో చేరింది.
ముకేశ్-నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీని రాధిక మర్చంట్ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాధిక వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.