NTR Unique Record: ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డు.. తెలుగులో మరే హీరో బీట్ చేయడం అసాధ్యం..

Tue, 28 May 2024-9:21 am,

ఎన్టీఆర్ పేరు అంటే ఓ చరిత్ర.. ఈయన తన లైప్ స్పాన్‌లో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా ఈయన టైటిల్ రోల్ చేసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

అన్న ఎన్టీఆర్ తన 44 యేళ్ల సినీ కెరీర్‌లో  48 పౌరాణికాలు.. 18 చారిత్రక చిత్రాలు.. 55 జానపద సినిమాలు.. 186 సోషల్ సబ్జెక్ట్ మూవీస్ చేసారు.

అప్పట్లో ప్యాన్ ఇండియా లెవల్లో హిందీలో 'చండీరాణి' సినిమా చేసారు. అంతేకాదు నయా ఆద్మీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో 'సంతోషం' పేరుతో తెరకెక్కింది.

ఆ సంగతి పక్కనపెడితే.. హీరోగా  ఎన్టీఆర్ పనైపోయిందనుకున్న వాళ్లకు 1977లో తన సినిమాలతో గట్టి సమాధానమే ఇచ్చారు.

ఆ యేడాది జనవరి 14న తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాన వీర శూర కర్ణ' సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

 

ఇక ఏప్రిల్ 28న అదే యేడాది కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలిసారి ఎన్టీఆర్ నటించిన 'అడవి రాముడు' సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలుకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది.  అంతేకాదు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇక 1977 అక్టోబర్ 21న ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన 'యమగోల' మూడో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

అసలు ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటిది ఒకే యేడాది మూడు చిత్రాలు ఒక దాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం అనేది అన్నగారి  విషయంలో జరిగింది. మరే తెలుగు హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో సాధ్యం కాబోదు కూడా.

1977లో ఎన్టీఆర్ ఈ మూడు ఇండస్ట్రీ హిట్ మూవీస్‌తో పాటు చాణక్య చంద్రగుప్త, ఎదురీత, మా ఇద్దరి కథ  వంటి మరో సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link