NTR Politics: రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్.. వరుసగా మూడేళ్లు సీఎంగా ప్రమాణ స్వీకారం..

Tue, 28 May 2024-4:05 am,

అన్న ఎన్టీఆర్ సినిమాల్లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పారు. అదే సమయంలో రాజకీయాల్లో అతి తక్కువ టైమ్‌లో పెను సంచలనమే సృష్టించారు.

13 యేళ్ల పొలిటికల్ లైఫ్‌లో 4 సార్లు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

 

1983, 1984, 1985 వరుసగా మూడేళ్లు ఆంధ్ర ప్రదేశ్‌గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది.

అంతేకాదు గత 42 యేళ్లుగా ఆయన స్థాపించిన తెలుగు దేశం అనే ప్రాంతీయ పార్టీ ఇప్పటికీ రాజకీయ యవనికపై రెపరెప లాడుతోంది.

సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు అన్న ఎన్టీఆర్ సొంతం.

ఎన్టీఆర్ రాకతో రాజకీయాల్లో సినీ నటులకు విలువ పెరిగింది. ఆయన కంటే ముందు కొంత మంది నటులు రాజకీయాల్లో రాణించారు. ప్రాంతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది..

తెలుగు దేశం పార్టీ ఛీఫ్‌గా చైతన్య రథంపై ఆయన చేసిన యాత్ర రాజకీయాల్లో పెను సంచలనం.. అద్వానీ మిగతా నాయకులకు రథయాత్రలకు ఎన్టీఆర్ ప్రేరణ అని చెప్పాలి.

లోక్‌సభలో ఓ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్.

1984 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగితే.. ఏపీలో టీడీపీ ప్రభంజనం వీచింది.

80వ దశకం చివర్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన అన్నగారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link