Numerology: ఈ తేదీలో పుట్టినవారు అదృష్ట దేవతలు.. ఎక్కడకు వెళ్లినా అద్భుతాలు సృష్టిస్తారు..!

Fri, 25 Oct 2024-11:26 am,

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏదైనా నెలలో 12వ తేదీ పుట్టినవారు అత్యంత అదృష్టవంతులు. వారు జీవితంలో ప్రతీది సాధిస్తారు. లక్ష్యాలను త్వరగా అధిరోహిస్తారు.   

అంతేకాదు ఈ ప్రపంచంలో వీరు ఎక్కడకు వెళ్లినా లగ్జరీ జీవితం అనుభవిస్తారు. వీరికి మంగళ, శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి. వీరు పోలీసు, ఆర్మీ రంగాల్లో బాగా విజయాలు సాధిస్తారు.  

12వ తేదీ పుట్టినవారు సర్దుకుపోయే గుణం కూడా కలిగి ఉంటారు. వీరు చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపించే సౌమ్యులు.ఈ మేధావులు అప్పజెప్పిన సమయానికి పూర్తి చేసే సమర్థులు.  

ఈ తేదీలో పుట్టినవారు వారి కెరీర్‌లో పురోగతి త్వరగా సాధిస్తారు. సాదాసీదాగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరికి బాగా కలిసి వచ్చే నంబర్లు 3, 12, 21 శుభదినాలు.  

వీరికి జీవితంలో అనుకున్నది ప్రతీది దొరుకుతుంది. ఎందుకంటే వీరికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. జీవితం హాయిగా సాగిపోతుంది. ఎవరినైనా ప్రేమిస్తే వారిని జీవితాంతం వదిలిపెట్టరు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link