Numerology: ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే తండ్రి ఎప్పటికైనా ధనవంతుడు అవ్వడం పక్కా..!
ఒక వ్యక్తి అదృష్టం వరిస్తుంది అంటే అతని కర్మలను బట్టి ఉంటుంది. అయితే, ఇంటి సంతానం ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిల్లవాడు కొన్ని అద్భుతమైన తేదీల్లో పుడితే తండ్రికి యోగం వస్తుంది. అప్పుడే ఆ పిల్లలకు కూడా యోగప్రాప్తి కలుగుతుంది.
మీ ఇంట్లో మొదటి సంతానం అమ్మాయి లేదా అబ్బాయి అయినా ఇది వర్తిస్తుంది. కొంతమందికి ఒక వయస్సులో యోగం కలిగితే, మరికొందరికీ వెంటనే యోగ ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వారి పుట్టిన సంఖ్య ఆధారంగా జరుగుతుందట.
6వ నంబర్ ర్యాడిక్స్ ఉన్న మొదటి సంతానం తండ్రికి ధనలాభం కలుగుతుందట. వారు అనుకున్నది సాధిస్తారు. ప్రారంభించిన ప్రతి వ్యాపారం పైకి దూసుకుపోతుందట. తిరుగుండదు. ర్యాడిక్స్ 6 అంటే 6, 15, 24 నంబర్‌లలో పుట్టిన వారు.
5, 14, 23 పుట్టిన తేదీ వారు వల్ల కూడా తండ్రి జాతకం మారిపోతుంది. మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే ఐదేళ్ల నుంచి తండ్రికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది.
8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు కూడా తండ్రికి అశేష ధన ప్రయోజనం కలుగుతుంది. ప్రారంభంలో తండ్రికి కొన్ని అవంతరాలు ఎదురవుతాయి. కానీ, ఆ తర్వాతి కాలంలో తండ్రికి బాగా కలిసి వస్తుంది.(గమనిక: ఇది ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసింది)