Public Holiday: అక్టోబర్‌ 11న పబ్లిక్‌ హాలిడే.. బ్యాంకులకు సెలవు..! ఆర్‌బీఐ ప్రకటన..

Thu, 10 Oct 2024-10:31 pm,

అక్టోబర్‌ 11న దుర్గా పూజ సందర్భంగా అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు దినం. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మహ అష్టమి సందర్భంగా ఈరోజు బ్యాంకులు కూడా బంద్ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో దుర్గా పూజ చేస్తారు.  

నవరాత్రుల్లో ప్రత్యేకంగా 9 రోజులపాటు దుర్గామాతను పూజిస్తారు. బ్యాంకులు ఈ సందర్భంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్‌ 11న పబ్లిక్‌ హాలిడే కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా అక్టోబర్‌లో బ్యాంకులు కేవలం 15 రోజులే పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్‌ 11 బ్యాంకులు బంద్‌ ఉండే ప్రాంతాలు.. కర్నాటక, తమిళనాడు, అసోం, త్రిపుర, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, బిహార్‌, జార్ఖండ్‌, మేఘాలయలో అన్ని పబ్లిక్‌ ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు. అయితే, బ్యాంకులు బంద్‌ ఉన్నా కానీ ఆన్‌లైన్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

మహా అష్టమి..  ఈరోజు కాళీ మాతను పూజిస్తారు. కాళీ అంటే శక్తి, ధైర్యానికి ప్రతీక. ఎనిమిదవ రోజు జరుపుకుంటారు. ఈరోజు భక్తిశ్రద్ధలతో దుర్గా మాతను పూజించి, కన్యా పూజ కూడా ఈరోజే నిర్వహిస్తారు. దుర్గా మాత విజయానికి ప్రతీకగా మహా నవమి సెలబ్రేట్‌ చేస్తారు.

అక్టోబర్‌ 12 దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్‌, ప్రైవేటు బ్యాంకులకు సెలవు. అంతేకాదు ఈరోజు రెండో శనివారం కూడా. అక్టోబర్‌ 14న సిక్కింలో దుర్గాపూజ నిర్వహించనున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో బ్యాంకులు బంద్.  

అక్టోబర్‌ 16 అగర్తలా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్‌ 17 వాల్మికీ జయంతి సందర్భంగా సెలవు. ఆదివారం అక్టోబర్‌  20 బ్యాంకులకు సెలవు. అక్టోబర్‌  26 నాలుగో శనివారం కాబట్టి అన్ని బ్యాంకులకు సెలవు.  

అక్టోబర్‌ 27 ఆదివారం కాబట్టి బ్యాంకులు బంద్‌ పాటిస్తాయి. అక్టోబర్‌ 31 దీపావళి కొన్ని ప్రాంతాల్లో నవంబర్‌ 1న దీపావళి జరుపుకుంటారు. ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో రేపు యథావిధిగా బ్యాంకులు కొనసాగుతాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link