Japan Mango: ఒడిశా నేల నుంచి జపాన్ మియాజాకీ మామిడిని సృష్టించిన టీచర్, కిలో 3 లక్షలపైమాటే
ఈ మామిడి పంట ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య వరకూ ఉంటుంది. ఇతర మామిడి చెట్ల పెంపకంతో పోలిస్తే ఈ జాతి మామిడి పెంపకం చాలా కష్టం. మియాజాకీ మామిడి ఒక్కొక్క కాయ బరువు 350 నుంచి 900 గ్రాముల వరకూ ఉంటుంది. సాధారణంగా అంటే సరాసరిన ఒక్కొక్కటి 350-400 గ్రామలుంటుంది.
మామిడి పేరు జపాన్ కెక్యూషూ రాష్ట్రంలోని మియాజాకీ నగరం పేరుతో ఉంది. జపాన్‌లో మామిడికి ఆదరణ ఎక్కువ.
ఈ మామిడిని తాను 12 ఏళ్ల క్రితం వేశానని ఆ టిచర్ చెప్పాడు. మామిడి రంగు ఇతర మామిడి పండ్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుందన్నాడు. ఈ మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి
ఈ మామిడికి ఉండే ప్రత్యేకమైన అద్భుత రుచి కారణంగా ధర చాలా ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో మామిడి 3 లక్షల వరకూ పలుకుతుంటుంది. మియాజాకీ మామిడి పండ్లు కంటి చూపు తక్కువగా ఉన్నవారికి చాలా ప్రయోజనకరం. ఇవి తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.
ఒడిశాలోని కాలాహాండీ జిల్లా కందుల్ గుడాకు చెందిన ఓ టీచర్ మియాజాకీ జాతికి చెందిన మామిడిని దేశీయంగా పండించడంలో విజయం సాధించాడు.