Belly Button Oiling: నాభిలో నూనె రాస్తే నిజంగానే ఇన్ని సమస్యల్నించి విముక్తి పొందగలరా
ఒత్తిడి తగ్గడం
నాభి చుట్టూ ఆయిల్ మస్సాజ్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చంటారు. మాలిష్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
చిన్నారుల్లో గ్యాస్ సమస్య
చిన్నారులు అంటే శిశువులకు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటుంది. నాభిలో గానుగ నూనె వేసి మాలిష్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సైన్స్ పరంగా ఎలాంటి ఆధారం లేకున్నా అనాదిగా ఈ విధానం అమల్లో ఉంది.
జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం
నాభిలో నూనె వేసి చుట్టూ మాలిష్ చేయడం వల్ల కండరాలకు రిలాక్సేషన్ ఉంటుంది. దాంతో జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.
చర్మం నిగారింపు
కొన్ని రకాల నూనెల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నాబి చుట్టూ చర్మానికి పోషకాలు అందడం వల్ల డ్రైనెస్ దూరమౌతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది.
శరీరం సమతుల్యత
యోగాలో కూడా నాభిని శరీరానికి కేంద్ర బిందువుగా భావిస్తారు. నాభిలో నూనె పోయడం వల్ల శరీరంలో ఎనర్జీ సమతుల్యంగా ఉంటుంది
జీర్ణక్రియ మెరుగుదల
నాభి చుట్టూ నూనెతో మాలిష్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతమౌతుంది. దాంతో విసర్జన సరిగ్గా ఉండి కడుపు సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది.