Ola S1 Pro Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

Wed, 05 Apr 2023-8:25 pm,

Ola S1 Pro Electric Scooter: రూ. 1.3 లక్షలు ఖరీదైన ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఏప్రిల్ 16వ తేదీ వరకు రూ. 1.25 లక్షలకే అందించనున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తేల్చిచెప్పింది. 

Ola S1 Pro Electric Scooter: అంటే ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 5 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది అన్నమాట. 

Ola S1 Pro Electric Scooter: అంతేకాదండోయ్.. పాత స్కూటర్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే అదనంగా మరో రూ. 2 వేల ఎక్స్‌చేంజ్ బోనస్ అందించనున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వెల్లడించింది.

Ola S1 Pro Electric Scooter: సాధారణంగా అయితే హోమ్ చార్జర్ యూనిట్‌తో కలిపి ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ఖరీదు రూ. 1.3 లక్షలుగా ఉంది.

Ola S1 Pro Electric Scooter: ఆగస్టు 2021 లో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ అయిన తరువాత స్కూటర్‌కి భారీ డిమాండ్ కనబడటంతో ఓలా సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ధరలు భారీగా పెంచింది.  

Ola S1 Pro Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ తమ కంపెనీ తయారు చేస్తోన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై ధరలు పెంచడంతో ఆ ప్రభావం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై పడింది. దీంతో కంపెనీ మరోసారి డిస్కౌంట్ పేరుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధరలు తగ్గించక తప్పలేదు. ఆ తరువాత మరోసారి ఎలక్ట్రిక్ స్కూటర్స్ విక్రయాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే లక్షకుపైగా ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముడయ్యాయి.

Ola S1 Pro Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్ ముందు వరుసలో ఉందనే విషయం తెలిసిందే. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link