Oppo A18, A38: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో త్వరలోనే మార్కెట్‌లోకి Oppo A18, A38 మొబైల్స్‌..ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Sun, 20 Aug 2023-1:40 pm,

ఒప్పో A18, A38 మొబైల్స్‌ మిడ్ రేంజ్‌లో కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేస్తుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన విడుదల తేదిని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు త్వరలోనే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.   

ఒప్పో A38 మోడల్‌ FCC సర్టిఫికేషన్‌ను పొందినట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ మోడల్స్ విషయానికొస్తే..ఒప్పో A18, A38 స్మార్ట్‌ ఫోన్స్‌ CPH2591, CPH2579 మోడల్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.   

ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ అతి శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. లీక్‌ అయిన వివరాల ప్రకారం..MediaTek Helio G35 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుంగా ఈ మొబైల్‌ గేమింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని టెక్‌ నిపుణుల చెబుతున్నారు. 

ఇక ఒప్పో A18, A38 మొబైల్స్‌ డిస్ప్లే విషయానికొస్తే.. 6.56 అంగుళాల HD+ (720x1,612 పిక్సెల్స్) LCD డిస్ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. దీంతో పాటు చాలా రకాల డిస్ప్లేను కలిగి ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.  

మొదట ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్స్‌ను 4 GB ర్యామ్‌తో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 8GB వేరియంట్‌ను విడుదల చేస్తుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌  50 మెగాపిక్సెల్ బ్యాంక్‌ కెమెరాను కలిగి ఉంటుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link