Orange Seeds: నారింజ గింజల్లో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇక పారేయరు..!
నారింజలో సీజనల్ వ్యాధులకు పోరాడే గుణాలు కూడా కలిగి ఉంటాయి. అయితే ఎప్పుడు నారింజ పండు తిన్న ఇకపై నారింజ గింజలని పారేయకండి. ఇందులో మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ బలపరుస్తుంది.. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంటే సీజనల్ వ్యాధులు మనని చుట్టుముట్టినప్పుడు ఇది కాపాడుతుంది. ముఖ్యంగా జలుబు వంటి సీజనల్ జబ్బుల నుంచి కాపాడుతుంది. ఇవి మన ఆరోగ్యానికి కాదు చర్మానికి కూడా ఎంతో మంచిది
ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మ కణాలను కాపాడతాయి. ముఖ్యంగా మన చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ఆరెంజ్ ను స్కిన్ కేర్ రొటీన్ లో కూడా ఉపయోగిస్తారు. ఇవి ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది.
జీర్ణ ఆరోగ్యం.. ఆరెంజ్ తో పాటు వాటి గింజలను కూడా తీసుకోవటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పేగు కదలికలకు మార్గం సుగమం చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మలబద్ధక సమస్యలు నివారిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం.. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుంది అంటే నేచురల్ గా మీ చర్మ రంగును మెరుగుపరుచుకోవచ్చు