Rahul Sipligunj: కొత్త అవతారంలో రాహుల్ సిప్లిగంజ్.. గ్యాంగ్ స్టర్ పాత్రలో ఆస్కార్ విన్నర్..

Mon, 21 Oct 2024-5:24 pm,

రాహుల్ సిప్లిగంజ్.. పాత బస్తీ ధూల్ పేటలో బోనాల రికార్డింగ్ డాన్స్ పాటలు పాడిన ఈ యువకుడు సినిమాల్లో గాయకుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటను కాలభైరవతో కలిసి ఆలపించాడు. ఈ పాటతో ఇంటర్నేషనల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు.

తన పాటకు గల్లీలో గుర్తింపు వస్తే చాలనుకునే స్థాయి నుంచి ఆస్కార్ స్టేజ్ పై పాట వరకు ఎంతో మందికి ప్రేరణగా నిలిచేలా సాగింది రాహుల్ సిప్లిగంజ్ ప్రయాణం.

ఆ మధ్య తెలుగు  బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచి సంచలనం రేపాడు. దాంతో సినిమాల్లో గాయకుడిగా మరిన్ని అవకాశాలు రాహుల్ సిప్లిగంజ్ ను వెతుక్కుంటూ వచ్చాయి.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రాహుల్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఇందులో పాట పాడినందుకు కీరవాణి, కాల భైరవలతో కలిసి ఆస్కారు అవార్డు అందుకున్నారు.

అంతేకాదు సినిమాల్లో నటుడిగా తన లక్ పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే కృష్ణవంశీ ‘రంగమార్తండ’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్.. త్వరలో ఓ సినిమాలో గ్యాంగస్టర్ బిలాల్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా రాహుల్ సిప్లిగంజ్ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే తెలుస్తుంది. మరి గ్యాంగ్ స్టర్ ‘బిలాల్’ పాత్ర నటుడిగా రాహుల్ సిప్లిగంజ్ కిస్మత్ ఛేంజ్ చేస్తుందా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link