IPL Mega Auction: చెన్నైప్లేయర్లపై కాచుకు కూర్చున్న ఇతర జట్లు.. వస్తే కోట్లాభిషేకం
Chennai Super Kings: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ప్లేయర్ రిటెన్షన్ రూల్స్, వేలం నిబంధనల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ కమిటీ ఈ నిబంధనలను ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్‌లో ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ఉత్కంఠ నెలకొంది.
Chennai Super Kings: ఐపీఎల్ మెగా వేలంలో ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చని, విదేశీ ఆటగాళ్లు, స్థానిక ఆటగాళ్ల సంఖ్యకు ఎటువంటి పరిమితి లేదని తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో 2 ఆర్టీఎం కార్డులను కూడా ఆఫర్ చేయనున్నట్టు సమాచారం.
Chennai Super Kings: అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా అశ్విన్ సహా కొందరు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, పతిరణలను రిటైన్ చేయాలని భావిస్తున్నారు. వేలంలో శివమ్ ధూబే, రచిన్ రవీంద్ర ఆర్‌ఈఎం కార్డులను ఉపయోగించారు.
Chennai Super Kings: వచ్చే సీజన్ కోసం చెన్నై జట్టు కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు వేలానికి వస్తే ఐపీఎల్ వేలంలో ఇతర జట్లు కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మొయిన్ అలీ: చెన్నై మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, పార్ట్ టైమ్ స్పిన్‌తో మొయిన్ అలీ బలమైన ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్‌కేను నిలబెట్టుకునే అవకాశం లేకపోవడంతో మొయిన్ అలీ వేలానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇతడిపై ఆర్సీబీ, ఢిల్లీ తదితర జట్లు కన్నేశాయి.
తుషార్ దేశ్‌పాండే: పవర్‌ప్లే బౌలింగ్, డెత్ ఓవర్ బౌలింగ్‌కి మూలస్తంభంగా ఉన్న తుషార్‌ను చెన్నై వదులుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. తుషార్‌ను రిటైన్ చేసుకోకపోతే ముంబై, కోల్‌కత్తా ఇతర జట్లు అతనికి కోట్లు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మిచెల్ శాంట్నర్: ఎడమచేతి వాటం స్పిన్నర్ చాలా జట్లకు అవసరం. చెన్నై వదులుకునే ఆటగాళ్లలో శాంట్నర్ కూడా ఉన్నాడు. ఇతడిని ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ, పంజాబ్‌తోపాటు ఇతర జట కోట్లు చెల్లించి కొనుగోలు చేసే అవకాశాల ఉన్నాయి.