Parineeti Chopra-Raghav Chadha Wedding Pics: పరిణీతి చోప్రా-ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు వైరల్..!
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా సెప్టెంబరు 24న ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో గ్రాండ్ వేడుకగా వివాహం చేసుకున్నారు.
బీ టౌన్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే పెళ్లికి సంబంధించిన పిక్స్ ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తగా తీసుకున్నారు.
పెళ్లి తర్వాత రోజు సోమవారం ఉదయం పరిణీతి, రాఘవ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉమ్మడి పోస్ట్‌లో భార్యాభర్తలుగా తమ మొదటి అధికారిక పిక్స్‌ను షేర్ చేశారు.
"అల్పాహారం టేబుల్ వద్ద మొదటి చాట్ నుంచి మా మనసులు మాకు తెలుసు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం.. ఎట్టకేలకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఒకరినొకరు లేకుండా బతకలేం.." అని క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.
వీరి పెళ్లి పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలతోపాటు అభిమానులు కాంగ్రాట్స్ చెబుతున్నారు.