Praneetha Subhash: బొంగరం కళ్ళతో మరోసారి ఆకట్టుకున్న ప్రణీత.. అమ్మో బాపు గారి బొమ్మో..

Sat, 20 Jan 2024-1:11 pm,

Praneetha Subhash Pics:

బొంగరం లాంటి కళ్ళు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది… బాపు గారి బొమ్మో.. అంటూ మనల్ని మాయ చేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్.

2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ పెద్ద కళ్ళ సుందరి.

ఆ తరువాత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం మాత్రం సిద్ధార్థ తో నటించిన బావ.  

బావ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా ప్రణీతకు మాత్రం తెలుగులో క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆపై 2011లో ఉదయన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసి దాదాపు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటించింది.  

2013లో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేదితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ మంచు మనోజ్ తో నటించిన పాండవులు పాండవులు తుమ్మెద కూడా పరవాలేదు అనిపించుకుంది.

ఇక ఈ మధ్య పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని సినిమాలకి కొంచెం దూరమైన ప్రణీత ..ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన ఫోటోలతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా బ్లాక్ సూట్ లో అందమైన ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను అలరించింది.  

ఈ ఫోటోలలో ప్రణీత అత్తారింటికి దారేది చిత్రం టైం లో ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తూ.. అభిమానుల దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చుకుంటోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link