Thammudu heroine: పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా హీరోయిన్..ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Sun, 24 Nov 2024-5:18 pm,

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాల్లో తమ్ముడు ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్‌ కళ్యాణ్‌ మేనరిజం, అద్భుతమైన సంగీతం ఈ సినిమాను విజయవంతంగా . ఈ సినిమాలో అదితి గోవిత్రికర్‌ సెకండ్‌ హీరోయిన్‌గా "లవ్లీ" పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో ఆమె అందం, నటన కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేశాయి.    

అదితి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించినా, ఆమె అంతగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో వయ్యారిభామ అనే..ఒక ప్రత్యేక పాటతో కనిపించిన ఈ నటి..ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత..టీవీ షోల్లో, వెబ్‌సిరీస్‌ల్లో అలరించింది.  

అదితి నిజ జీవిత ప్రయాణం చాలామందికి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. సినిమా రంగంలోకి వచ్చే ముందు అదితి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి.. వైద్యురాలిగా తన జీవితం మొదలు పెట్టింది. ఆమె మోడలింగ్‌, నటనలో అదృష్టాన్ని పరీక్షించుకొని.. మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. అయితే కరోనా మహమ్మారి తర్వాత, పూర్తిగా వైద్య రంగంలో సేవలందిస్తోంది.  

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తాజా జీవిత విశేషాలను పంచుకుంటూ, అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె తాజా ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వయసు ప్రభావంతో ఆమె రూపం మారిపోయినా..ఆమె సహజ అందం ఇంకా మెరుస్తోంది అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నాడు.    

వ్యక్తిగతంగా, ఆమె భర్తకు విడాకులు ఇచ్చి తన పిల్లలతో కలిసి జీవిస్తోందట. ఒకప్పుడు తెరపై కుర్రకారును ఆకర్షించిన ఈ నటి ఇప్పుడు వైద్యురాలిగా తన సేవలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.  మొత్తానికి, తమ్ముడు సినిమాలో మెరిసిన అదితి గోవిత్రికర్‌ ప్రస్తుతం వైద్య రంగంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link