Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

Wed, 02 Oct 2024-10:31 am,

పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ఆయన ఇద్దరు కూతుళ్లు ఆద్యాతో పాటు చిన్న కూతురు పలీనా అంజని కొణిదెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. తను హిందువు అయినా.. కూతురు క్రిష్టియన్ కావడంతో తిరుమల అధికారులకు తన కూతురుకు స్వామి వారిపై నమ్మకం ఉన్నట్టు డిక్లరేషన్ పై సంతకం పెట్టారు.

కూతురు పలీనా అంజని  మైనర్ కావడంతో ఆమె తరుపున పవన్ కళ్యాణ్ సంతకం చేయడం విశేషం. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా కూతురు కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆమెతో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డులకు ఎక్కింది.

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link