Payal Rajput: పాయల్ బోల్డ్ ఫోటోలు.. షట్ బటన్ తీసేసి.. కవ్వించిన బ్యూటీ
మొదటి సినిమాతోనే అందరిని ఆశ్చర్యపరిచిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా చేసిన ఆర్ఎక్స్ 100 సినిమాతో.. ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్. మొదటి చిత్రంలోని బోల్డ్ పాత్రలో.. కనిపించి అందరిని షాక్ గురిచేసింది.
కాగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కూడా అందుకుంది ఈ హీరోయిన్. ఆర్ఎక్స్ 100 తనకి సూపర్ సక్సెస్ అందించడమే కాకుండా.. ఎన్నో సినిమా అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ హీరోయిన్ కి ఎక్కువ బోల్డ్ సినిమాలే ..రావడం ఒక మైనస్ గా మిగిలింది.
మధ్యలో వెంకటేష్.. నాగచైతన్య హీరోలుగా చేసిన వెంకీ మామ సినిమాలో కనిపించి మెరిసింది. ఈ చిత్రంతో పాయల్ కి స్టార్ హీరోల సినిమాలలో.. కూడా అవకాశాలు వస్తాయి అనుకున్నారు అందరూ. కానీ దురదృష్టవ కొద్ది ఆ తర్వాత పాయల్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఇక ఈ మధ్యనే మరోసారి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో.. మంగళవారం అనే చిత్రం చేసి మంచి విజయం అందుకుంది. ఇక కొద్ది రోజుల క్రితం రక్షణ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రక్షణ సినిమాలో పాయల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.