Numerology: ఈ తేదీలో పుడితే మీరే కింగ్‌.. ఇందులో మీ పుట్టినరోజు కూడా ఉందా? చెక్‌ చేయండి..

Fri, 12 Jul 2024-10:03 am,

జ్యోతిష్యం వలె సంఖ్య శాస్త్రం ద్వారా కూడా సులభంగా ఒక వ్యక్తి ఎలాంటి నడవడి కలవాడో.. అతని కెరీర్‌ ఎలా ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు. ఈరోజు న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు ఉన్న వ్యక్తులు గురించి తెలుసుకుందాం. వారి జీవితం ఎలా ఉంటుంది ఏ స్థాయికి చేరుకుంటారు చూద్దాం.  

ర్యాడిక్స్‌ అంటే రెండు సంఖ్యలను కలుపగా వచ్చే ఫలితాన్ని ర్యాడిక్స్‌ అంటారు. ఈరోజు ర్యాడిక్స్‌ ఒకటి గురించి తెలుసుకుందాం. ఈ ర్యాడిక్స్‌ లో పుట్టినవారికి చాలా తెలివితేటలు ఉంటాయి. వ్యాపారంలో కూడా బాగా రానిస్తారు. 1, 10,19,28 తేదీల్లో పుట్టినవారి ర్యాడిక్స్‌ 1 అవుతుంది  

ఈ తేదీల్లో పుట్టినవారు ఏదైనా పనిని మొదలు పెడితే చివరి వరకు దాన్ని వదిలిపెట్టరు. పని పూర్తి చేసిన తర్వాతే గాలి పీల్చుకుంటారు. అంతేకాదు వీరు కేవలం వారి లక్ష్యంపైనే దృష్టి పెడతారు. అది సాధించే వరకు వదలరు.  

ఈ ర్యాడిక్స్‌లో పుట్టినవారు ఒక్కోసారి ఇతరులపై తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటారు. స్వార్థంగా మారతారు. దీనివల్ల వీరి రిలేషన్‌షిప్‌లో సైతం ఒక్కోసారి చీలిక ఏర్పడవచ్చు.  

ముఖ్యంగా 1 ర్యాడిక్స్‌లో పుట్టినవారికి విజయ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. వారు దాన్ని సాధించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. వీరు ముఖ్యంగా వ్యాపారం, రాజకీయాల్లో అయితే వీరి కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link