Phalguna Amavasya: నేడు ఫాల్గుణ అమావాస్య.. ఉప్పుతో ఇలా చేస్తే అన్ని అనర్థాలు తొలగి ధనవంతులవుతారు..
అమావాస్య రోజున నీళ్లలో కాస్త ఉప్పు కలిపి.. ఆ నీటితో సాయంత్రం పూట ఇల్లంతా తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది.
అమావాస్య సాయంత్రం చేపలకు పిండి మాత్రలు తినిపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో సహా అన్ని అనర్థాలు తొలగిపోతాయి. .
ఫాల్గుణ అమావాస్య నాడు సాయంత్రం ఇంట్లో హవనం చేయండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
సాయంత్రం పూట రావి చెట్టుకు పూజ చేసి.. చెట్టు వద్ద దీపం వెలిగిస్తే జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
సాయంత్రం పూట ఇల్లంతా కర్పూరం వెలిగించాలి. ఈ పరిహారంతో, జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది.