Arjun Sarja: హనుమాన్ టెంపుల్ నిర్మించిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, Hanuman Temple Photos

Thu, 08 Jul 2021-5:52 pm,

తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా. ఆధ్యాత్మిక విషయాలపై ఆయన ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో దశాబ్దన్నర కలను నేర్చుకున్నారు సీనియర్ నటుడు అర్జున్. 17 ఏళ్లపాటు శ్రమించి ఆంజనేయస్వామికి ఆలయం నిర్మించారు.  (Photos Credit: Twitter)

Also Read: RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీలో మార్పు లేదా..అక్టోబర్ 13నే విడుదలా

తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో హనుమాన్ని ఆలయాన్ని నటుడు అర్జున్ నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభోత్సవం ఇటీవల నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్ సహా ఇరత సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నారు.  (Photos Credit: Twitter)

గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా శ్రీ ఆంజనేయం. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హనుమంతుడి పాత్రను పోషించారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆంజనేయుడికి గుడి కట్టాలని నటుడు భావించారు. 17 ఏళ్లపాటు పడ్డ శ్రమకు తాజాగా ప్రతిఫలం దక్కింది. ఎట్టకేలకు హనుమాన్ టెంపుల్ నిర్మాణం పూర్తి చేసి, ప్రత్యేక పూజలతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.  (Photos Credit: Twitter)

Also Read: Aamir Khan And Kiran Rao Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ నుంచి అర్బాజ్, మలైకా అరోరా వరకు బాలీవుడ్‌లో షాకింగ్‌ విడాకులు ఇవి

140 టన్నుల భారీ హనుమాన్ విగ్రహంతో ఆలయాన్ని నిర్మించారు. సొంత ఖర్చులతోనే నటుడు అర్జున్ సర్జా ఈ ఆలయానికి కార్యరూపం ఇచ్చారు. కరోనా వ్యాప్తి సమయం కనుక తన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఆలయాన్ని నటుడు అర్జున్ ప్రారంభించారు.  (Photos Credit: Twitter)

దశాబ్దంన్నరకు పైగా శ్రమించి సొంత ఖర్చులతో రామ బంటు ఆంజనేయుడికి నటుడు అర్జున్ సర్జా ఆలయాన్ని నిర్మించారనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ భక్తులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  (Photos Credit: Twitter)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link