Photos of Mouni Roy: అందాలతో కైపెక్కిస్తోన్న నాగిని.. మౌనీ రాయ్ ఫొటోస్ వైరల్
బాలీవుడ్ సినిమాతో రంగుల ప్రపంచానికి పరిచయమైన నటి మౌనీ రాయ్. రన్ సినిమాతో 2004లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా అవకాశాలు రాలేదు. కానీ తన అందచందాలతో మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ తరువాత బుల్లితెర వైపు అడుగులు వేసింది. తాజాగా మౌనీ రాయ్ షేర్ చేసిన ఫొటోలు (Photos of Mouni Roy) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘క్యూకీ సాస్ భీ కభీ బహూ తీ’ సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయమై మౌనీ రాయ్ మంచి గుర్తింపు పొందింది. దేవత పాత్రల్లోనూ నటించి మెప్పించింది. బుల్లితెరపై మౌనీ రాయ్ నాగిని సీరియల్‌లో నటనతో గుర్తింపు పొంది మరోసారి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.
సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు, నెటిజన్లకు ఎప్పుడూ చేరువగా ఉంటోంది. తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో కుర్రకారును గిలిగింతలు పెట్టిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
అందం కోసం సర్జరీలు చేయించుకుందని, కత్తెర పడ్డాక అందం రెట్టింపు అయిందనే గుసగుసలు బాలీవుడ్ సర్కిల్స్‌లో ఎప్పుడూ వినిపిస్తుంటాయి.
2020 ఏడాదిలో మౌనీ రాయ్ రెండు సినిమాలు చేస్తోంది. బ్రహ్మాస్త్రతో పాటు లండన్ కాన్ఫిడెన్షియల్ సినిమాలతో బిజీగా గడుపుతోంది.