లవ్ బర్డ్స్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి లవ్లీ ఫొటోలు!
భారత్‌లో క్రికెట్‌కు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. దశాబ్దాల నుంచి క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులను ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గురించి అటు క్రికెట్, ఇటు సినీ రంగంలో వదంతులు గుప్పుమంటున్నాయి.
వీరు గత కొంతకాలం నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ ప్రేమ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. అయితే వీరు పరోక్షంగా తమ ప్రేమను తెలుపుతూనే ఉన్నారు. ఇటీవల కేఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా నా మనిషి అంటూ క్రికెటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అతియా శెట్టి, క్రికెటర్ రాహుల్ జతగా తిరిగిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అందులోనూ లాక్డౌన్ టైమ్ కావడంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలను ఇక్కడ అందిస్తున్నాం. (PC: Instagram)