Pitru Paksha: శ్రాద్ధం పెట్టేందుకు కొడుకు లేకుంటే ఎలా? హిందూ ధర్మం ఏం చెబుతుందో తెలుసా
Pitru Paksha 2024: పితృ పక్షం భాద్రపద పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై అశ్విన్ అమావాస్య రోజున ముగుస్తుంది.
Pitru Paksha 2024: పితృ పక్షం17 సెప్టెంబర్ 2024 నుంచి ప్రారంభమై 2 అక్టోబర్ 2024న ముగియనుంది. మొత్తం 16 రోజులలో పూర్వీకుల శ్రాద్ధ కర్మలు, తర్పణం, పిండ ప్రదానం చేయాలి.
Pitru Paksha 2024: పితృ పక్షంలో చనిపోయిన వారి ఆత్మ శాంతి, సంతృప్తి కోసం పూజలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. పూర్వీకులను పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయనే నమ్మకం ప్రగాఢంగా ఉంది.
Pitru Paksha 2024: అయితే కుమారులు లేని వారికి శ్రాద్ధం ఎవరు చేస్తారనే సందేహాలు ఉన్నాయి. కుమారుడు లేకపోతే ఎవరు శ్రాద్ధ కర్మలు చేయాలనే దానిపై హిందూ ధర్మశాస్త్రాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి.
Pitru Paksha 2024: హిందూ మత గ్రంథాల ప్రకారం పెద్ద కుమారుడికి శ్రాద్ధం చేసే మొదటి అర్హత ఉంది. పెద్ద కొడుకు చనిపోతే.. లేకపోయినా లేదా కొన్ని కారణాల వల్ల శ్రాద్ధం చేయలేకపోయినా చిన్న కొడుకు శ్రాద్ధం చేయవచ్చు.
Pitru Paksha 2024: కొడుకు లేకపోతే అతడి భార్య శ్రాద్ధం చేయవచ్చు. ఈ విషయాన్ని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.
Pitru Paksha 2024: కుటుంబంలో ఒక్క కూతురు మాత్రమే ఉంటే ఆమె కుమారుడు అంటే మనవడు కూడా శ్రాద్ధం చేయవచ్చు. ఇక సోదరుడి కొడుకు అంటే మేనల్లుడు కూడా శ్రద్ధ చేయవచ్చు.
Pitru Paksha 2024: ప్రతిపాద తిథి నాడు మరణించిన వారికి శ్రాద్ధం చేస్తారు. ఈ రోజున పూర్వీకులకు తర్పణం, పిండదానం చేయాలి.
Pitru Paksha 2024: శ్రాద్ధ పక్షంలో అంటే పితృపక్షంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధ. ఈ సమయంలో ఆహారం, పానీయాలు మొదలైన వాటిపై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.