Pitru Paksham 2024: ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకి పితృపక్షంలో ఈ ఒక్క పనిచేస్తే.. మోక్షంతో పాటు.. స్వర్గలోకాలు..
పితృ పక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 02 వరకు జరుపుకుంటారు. ఈ కాలంలో చనిపోయిన మన పూర్వీకులు తిరిగి భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. అంతే కాకుండా.. ఈ సమయంలో పూర్వీకుల కోసం.. ఏపని చేపట్టిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని నమ్ముతుంటారు.
పితృ పక్షం పుణ్య కాలంలో.. చనిపోయిన పూర్వీకులు పేరు మీద వారి వారసులు శ్రాద్ధకర్మాదులు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల, వారి ఆత్మ శాంతిస్తుందని చెబుతుంటారు. చాలా మంది పూర్వీకుల శాపంతో తెగ ఇబ్బందులు పడుతుంటారు.
జీవితంలో సరైన విధంగా గ్రోత్ ఉండదు. ఉద్యోగలంలో ప్రమోషన్ లు ఉండవు. జీవితమంతా అయోమయంగా ఉంటుంది. దీని వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పితృ పక్షంలో చనిపోయిన మన పూర్వీకులకు ప్రీతికోరకు, పండితులకు దాన, ధర్మాలు చేస్తుంటారు.
ఇదిలా ఉండగా.. చాలా మంది ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంత మంది ప్రేమలో విఫలమయ్యామని, సంసారంలో గొడవలు వచ్చాయని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా.. పెళ్లి కావడంలేదని కూడా కొంత మంది అకాలంగా తమ జీవితానికి ముగింపు పలుకుతారు.
దేవుడు ఇచ్చిన జీవితాన్ని అర్థంతరంగా ముగించడం చాలా పాపమని కూడా చెబుతుంటారు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి మోక్షం ఉండదని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా.. వీరు తమ కోరికలు తీరక ముందే చనిపోవడం వల్ల.. దేని మీద వీరి మనస్సు ఉంటుందో.. వాళ్ల చుట్టు లేదా ఆ వస్తువుల చుట్టు తిరుగుతుంటారు.
వీరికి పితృపక్షంలో పెళ్లికాకుండా చనిపోతే.. శాంతి జరిపించాలి. ఏదైన వస్తువులు ఇష్టమున్న అకాలంగా చనిపోతే.. వారి పేరు మీదుగా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. చనిపోయిన వారి పేరు మీదుగా నదుల్లో వారికి ఇష్టమైన వాటిని వదిలేసి రావాలి. ఇలా చేస్తే వారికి మోక్షం దొరుకుతుందని కూడా పండితులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)