Lucky Zodiac Signs: రేపటి నుంచి ఈ 6 రాశులకు మహర్దశ, భారీగా ధనలాభం ఇందులో మీ రాశి ఉందా

Mon, 30 Sep 2024-12:06 pm,

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు అక్టోబర్ నెల బాగా కలిసొస్తుంది. విద్యార్ధులకేైతే కెరీర్ బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. 

వృషభ రాశి

అక్టోబర్ నెల వృషభ రాశి జాతకులకు చాలా మంచిది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా లాభపడతారు. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

తులా రాశి

తులా రాశి జాతకులకు అక్టోబర్ నెల మహర్దశ పట్టిస్తుంది. అన్ని రంగాల్లో అదృష్టం ఉంటుంది. విద్యార్ధులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కెరీర్ బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్ఠితిలో ఉంటారు. 

సింహ రాశి

ఈ రాశి జాతకులకు అక్టోబర్ నెల ఊహంచని సిరి సంపదలు తెచ్చి పెడుతుంది. ఎప్పట్నించో ఉన్న సమస్యలు పరిష్కారమౌతాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. వారసత్వ సంపద లభించడంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు

మిధున రాశి

ఈ రాశి జాతకులకు అక్టోబర్ అద్భుతంగా ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటుంది. వ్యాపారులకు కొత్త వ్యాపారాలు కలిసొస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలుంటాయి.పెళ్లి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. సాఫీగా సాగాతుంది. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు అద్భుతమైన సమయమిది. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది. అంటే కనకవర్షం కురుస్తుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు అందరికీ అనువైన సమయం. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link