Planet Transit October 2024: ఆ మూడు రాశులకు అక్టోబర్ నెలలో మహర్దశ, వద్దంటే వచ్చిపడే డబ్బు
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. అక్టోబర్ నెలలో సూర్యుడు, బుధుడు, మంగళ, శుక్ర గ్రహాలు గోచారం చేయనున్నాయి. అక్టోబర్ 10 బుధుడు తులా రాశిలో ప్రవేశిస్తే, అక్టోబర్ 13న శుక్రుడు వృశ్చిక రాశిలో గోచారం చేయనున్నాడు. అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలో, అక్టోబర్ 20న మంగళ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు.
శుభ రాజయోగాలు
ఇలా గ్రహాల గోచారం కారణంగా మనిషి జాతకాన్ని పూర్తిగా మార్చేసే రాజయోగాలు ఏర్పడనున్నాయి. తులా రాశిలో శుక్రుడు సూర్యుడి యుతి కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రాజయోగానికి చాలా మహత్యం ఉంది. కొన్ని రాశులకు జీవితం మారిపోనుంది.
శని నక్షత్ర మార్పు కూడా అక్టోబర్ నెలలోనే
గ్రహాల్లో కీలకంగా భావించే శని గ్రహం నడకలో మార్పు రానుంది. అక్టోబర్ 3వ తేదీ మద్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు తూర్పు భాద్రపద నక్షత్రం నుంచి శతభిష నక్షత్రంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఆ నక్షత్రంలో డిసెంబర్ 27 నరకూ ఉంటుంది. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడనుంది. ఏయే రాశుల జాతకాన్ని మహర్దశ పట్టించనుందో తెలుసుకుందాం
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు అక్టోబర్ నెల అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఈ సమయంలో విద్యార్ధులైతే కెరీర్ బాగుపడుతుంది. అంటే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఇక వ్యాపారులు లాభాలు ఆర్జించడమే కాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అంతా అనుకూలిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్ఠితిలో ఉంటారు.
సింహ రాశి
సింహ రాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా ప్రయోజనం కల్గిస్తుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో లేదా పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుుటంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకంలో పుట్టిన వ్యక్తులకు అక్టోబర్ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మొత్తం జీవితమే మారిపోనుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగులైతే పదోన్నతి పొందుతారు లేదా కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో అంతా సుఖ శాంతులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.