PM Kisan: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..

Fri, 08 Nov 2024-6:07 am,

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్‌ పై ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. 19వ విడత నిధుల కోసం చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు. అయితే, కొంతమందికి ఈ పీఎం కిసాన్‌ డబ్బులు జమా కావట్లేదు. దీనికి ప్రధాన కారణం పీఎం కిసాన్‌ ఐదేళ్ల నియమం. 2019కు ముందు భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి మాత్రమే డబ్బులు జమా అవుతున్నాయి..  

ఆ తర్వాత చేసుకున్న రైతులకు ఈ డబ్బులు క్రెడిట్‌ అవ్వడం లేదు. అయితే, ఇప్పటికే ఐదేళ్ల నియమం కూడా పూర్తయింది. అయినా కానీ, పీఎం కిసాన్‌ నిధులు తాము పొందలేక పోతున్నాం అని రైతులు వాపోతున్నారు. అయితే, 19వ విడత నిధులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.   

ఈలోగా రైతులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని ఉండాలి. స్థానిక ఎమ్మార్వో ఆఫీసుల్లో మీ భూమి రికార్డు వివరాలను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పని పూర్తి చేసుకోవాలి. అంతేకాదు బ్యాంకుల్లో కూడా మీ ఖాతా వివరాలను, ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలి.  

ఫేక్‌ లబ్దిదారులకు అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. పీఎం కిసాన్‌ ద్వారా ఏటా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే, 19 వ విడత డబ్బులు పొందడానికి కూడా రైతుల అనర్హులు అయ్యే అవకాశం ఉంది. సరైన నియమాలు రైతులు చాలామంది అవగాహన లోపం వల్ల పాటించడం లేదు.   

ఈ పై నిబంధనలు అన్ని పాటిస్తే ఐదేళ్ల నియమం పూర్తయింది కాబట్టి వారు కూడా పీఎం కిసాన్‌ ద్వారా సాయం పొందవచ్చు. కేవైసీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. pmkisan.gov.in ద్వారా పీఎం కిసాన్‌ లబ్దిదారుల స్టేటస్‌ చెక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, మీరు కేవైసీ పూర్తి చేయాలంటే కొన్ని పత్రాలు మీ వద్ద ఉండాలి.  

పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కేవైసీ చేసుకోవడానికి మీ వద్ద ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌, భూమి వివరాలు కలిగి ఉండాలి. లేకపోతే స్థానికంగా ఉండే పీఎం కిసాన్‌కు సంబంధించిన ఆఫీసుల్లో కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link