PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. 19వ విడుత రూ.2,000 ఆరోజే ఖాతాల్లో జమా..!
ఈ నెల అక్టోబర్ 5వ తేదీన పీఎం కిసాన్ 18వ విడుత నిధులను పీఎం నరేంద్ర మోదీ సర్కార్ విడుదల చేసిన సంగతి తెలిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు.
పీఎం కిసాన్ పథకంలో మీ పేరు లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. pm kisan.gov.in ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.రిజిస్టర్ మొబైల్ నంబర్, ఆధార్‌కార్డు తప్పనిసరి. లబ్దిదారులు స్టేటస్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.
రైతలకు అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్‌లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఒకవేళ వారి ఖాతాల్లో డబ్బులు జమా కాకపోతే వెంటనే కాల్ చేయవచ్చు.
ప్రతిఏడాది రైతులకు రూ.6000 ఖాతాల్లో జమా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రధాన లక్ష్యం చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడం. ఏడాదికి మూడు సార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది.
రూ.2000 ఒక్కో విడతలో రైతుల ఖాతాల్లో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్) ద్వారా జమా చేస్తుంది. మొన్న 18వ విడత డబ్బులను విడుదల చేసిన పభుత్వం,19వ విడతను కూడా అతి త్వరలో విడుదల చేయనుందట.
2025 ఫిబ్రవరి నెలలోనే పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందట.