Farmers pension scheme: ఈ ఒక్క పని చేయండి చాలు..ప్రతినెలా రూ. 3,000 పొందే ఛాన్స్
Farmers pension scheme: ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ప్రణాళిక తప్పనిసరి. ముఖ్యంగా 60ఏండ్ల తర్వాత భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే కొంత డబ్బును జమ చేస్తుండాలి. వయస్సు మీద పడిన తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితంగా సాఫీగా సాగిపోతుంది. ఇది ఉద్యోగస్థుల వరకు అయితే సాధ్యం అవుతుంది. మరి రైతుల పరిస్థితి ఏంటి. వారు 60ఏండ్లు నిండిన తర్వాత వ్యవసాయం పనులు చేయడానికి వారి ఆరోగ్యం సహకరించదు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటి సందర్భంలో రైతులకు అండగా ఉండేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలతోపాటు రైతులకు కూడా చాలా పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేక పథకాలను రూపొందించింది. వారికి అండగా నిల్చునేందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అయితే ఈ పథకాలన్నీ సాగు చేసున్న రైతులకే భరోసా కల్పిస్తున్నాయి.
60ఏండ్లు నిండిన చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉంటున్నారు. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయం అంటూ ఉండదు. తోడుగా అనేక ఆర్థిక ఇబ్బందులు వారిని బాధిస్తుంటాయి. రైతుల సమస్యలను కేంద్రం గుర్తించింది. వారికి పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పేరుతో ఒక పెన్షన్ స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరిన వారు 60ఏండ్లు నిండి ఉండాలి. ఆతర్వాత వారికి ప్రతినెలా రూ. 3000 చేతికి వస్తుంది.
ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించే ఈ స్కీమును చిన్న రైతులు, అంటే తక్కువ భూమి ఉన్న రైతుల కోసం మాత్రమే రూపొందించింది. వ్యుద్ధాప్యంలో వాళ్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ స్కమ్ తీసుకువచ్చింది.
ఈ స్కీములో 18 ఏండ్ల నుంచి 40ఏండ్ల మధ్య వయస్సుకన్న రైతులు చేరవచ్చు. రైతుల పేర్లు దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భూమి రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు అయి ఉండాలి. అంతేకాదు 2 ఎకరాల వరకు సాగు భూమి ఉండాలి.
ఈ పథకంలో చేరితే 60ఏండ్లు దాటితే ప్రతినెలా కనీసం రూ. 3000వేల పెన్షన్ అందుకుంటారు. ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ స్కీములో చేరిన రైతు మరణిస్తే..వారి భార్య లేదా భర్తకు ఆ రైతు పొందుతున్న పెన్షన్ లో సగం మొత్తం ఫ్యామిలీ పెన్షన్ గా వస్తుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్ ను రైతు భార్య లేదా భర్త మాత్రమే తీసుకోగలుగుతారు.
ఈ పథకంలో చేరినవారు 60ఏండ్లు వచ్చేంత వరకు ప్రతినెలా రూ. 55 నుంచి రూ. 200 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకేవేళ 60ఏండ్లు పూర్తికాక ముందే రైతు మరణిస్తే..వారి జీవిత భాగస్వామి ఈ స్కీమును కొనసాగించవచ్చు. రైతులు ఎంత డిపాజిట్ చేస్తారో..దాని ఆధారంగా కేంద్రం నెల పెన్షన్ డిపాజిట్ చేస్తుంది. నెలకు రూ. 3000 పెన్షన్ కావాలంటే 18ఏండ్ల రైతు ప్రతి నెలా రూ. 55, 40 ఏండ్ల రైతు ప్రతి నెలా రూ. 200 ప్రీమియం డిపాజిట్ చేయాలి.