PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన!

Thu, 21 Jan 2021-12:40 pm,

రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్(Budget 2021)‌లో రైతులకు పీఎం కిసాన్ సమ్మన్ నిధిలో భాగంగా శుభవార్త అందించనున్నారని తెలుస్తోంది.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Samman Nidhi) కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు పెంచవచ్చు. ప్రస్తుతం రైతులకు అందిస్తతున్న 6 వేల రూపాయల నగదు మొత్తాన్ని రూ.10 వేలకు పెంచనున్నారని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకూ ఏడాదిలో మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి రూ.2వేల చొప్పున మొత్తం రూ.18,000 కోట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా జమ చేశారు. పథకం ప్రారంభించిన త్వాత ఓవరాల్‌గా రైతుల ఖాతాల్లో జమ అయిన 7వ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది.

Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

పిఎం కిసాన్ యోజన పథకాన్ని 1 డిసెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ .6000ను 3 వాయిదాలుగా అందిస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో రైతుల ఖాతాకు డబ్బు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 11.47 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

పీఎం వ్యవసాయ నీటిపారుదల పథకం కింద 2019-20లో రూ.9682 కోట్లుగా ఉన్న నిధులను 2020-21లో రూ .11,127 కోట్లకు పెంచారు. 2019-20లో పీఎం పంటల బీమా పథకం కింద రూ.14 వేల కోట్ల నిదులను 2020-21లో రూ .15,695 కోట్లకు పెంచారు. తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: PM kisan samman nidhi: మీ ఖాతాలో డబ్బులు చేరలేదా..ఇలా చేయండి చాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link