PM KISAN scheme: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి డబ్బులు ఎప్పుడు పడతాయి ?

Fri, 18 Dec 2020-2:45 pm,

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019లో ఫిబ్రవరి 24న ప్రారంభం అయింది మొదలు గత రెండేళ్లుగా ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ అవుతుండగా.. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుంచి ఒకే ఒక్కసారి ఇదే తరహాలో ఆలస్యమైంది.

ఈసారి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ( PM KISAN scheme third instalment ) ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ.. రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసేందుకు సర్వం సిద్ధమైందని, కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడటమే తరువాయి డబ్బులు ఖాతాల్లో పడతాయని అన్నారు.

గతేడాది డిసెంబర్‌లోనూ ఇలాగే ఒక నెల ఆలస్యం కాగా.. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ( PM Modi ) పాల్గొన్న సందర్భంగా ఆ నిధిని ఒకే విడతలో 60 మిలియన్స్ మంది ఖాతాలో జమ చేసిన విషయాన్ని సదరు అధికారి గుర్తుచేశారు.

పిఎం కిసాన్ పథకం ( PM KISAN scheme ) కింద అర్హులైన రైతుల ఖాతాల్లో కేంద్రం ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also read : 7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు

Also read : SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!

Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link