PM Kisan: రైతులు ఇతరుల భూమిలో పంట పండిస్తే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఇది చాలామందిలో వచ్చే ప్రశ్న.. ఇతరుల భూమిలో పంట పండించే రైతులకు పిఎం కిసాన్ పథకం కి అర్హులు అవుతారా?
భూమి రిజిస్టర్ అయి ఉన్న వ్యక్తులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అందుతాయి. ఎందుకంటే ఈ పథకానికి అప్లై చేసుకునే సమయంలోనే అన్ని ఆధారాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది..
అంతేకాకుండా సదరు భూమి కలిగిన రైతులు ఈ కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. బ్యాంకు ఖాతా కూడా లింకు చేయాల్సి ఉంటుంది.. ఆధార్ అనుసంధానం చేయాలి. బ్యాంకు ఖాతా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా (NPCI) కు కనెక్ట్ అయి ఉంటుంది.
పీఎం కిసాన్ యోజన 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. పిఎం కిసాన్ 19వ విడుత డబ్బులు వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి నెలలో క్రెడిట్ అవుతాయి.
18 వ విడత డబ్బులు అక్టోబర్ 5వ తేదీన జమ చేశారు. అయితే ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ముందుగా ఏ ఈ కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు పీఎం కిసాన్ కు సంబంధించిన pmkisan-ict@gov.in ద్వారా వివరాలు పొందొచ్చు