PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..
ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికలు ముగియగానే తమిళనాడుకు చేరుకున్నారు. అక్కడ భగవతీ అమ్మాన్ ఆలయంను దర్శించుకున్నారు. ఈ ఆలయం 108 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తుంటారు. ఇక్కడి నుంచి కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకనంద రాయ్ మెమోరియల్ వద్దకు వెళ్లారు.
మోదీ.. మే 30 న సాయత్రం కన్యాకుమారీలో 45 గంటల దీక్షను ప్రారంభించారు. గతంలో స్వామి వివేక నంద ఇదే ప్రాంతంలో మూడు రోజుల పాటు మౌనంగా దీక్ష ను చేపట్టారని చెబుతుంటారు.
వివేక నంద స్మారక ప్రదేశంలో మండపం, బయటవైపు, లోపల మోదీ ధ్యానం చేశారు. మోదీ దీక్ష చేపట్టినప్పుడు.. కాషాయ దుస్తులు ధరించి, తొలుత సూర్యుడిని నమస్కారాలు చేశారు. భగవాన్ సూర్యుడికి అర్ఘ్యం వదిలి దీక్షను ప్రారంభించారు.
చేతిలో జపమాలను ధరించి, అకుంఠిత దీక్షతో ఆయన ఈ 45 గంటల దీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాని మోదీ దేవీ పాదం వద్దకూడా ధ్యానం చేశారని తెలుస్తోంది. ఏకాగ్రత చిత్తంలో ఆ దేవుడ్ని ధ్యానిస్తు, జపమాలతో దేవుడిని కొలుచుకుంటూ పూజలు చేశారు.
చివరిదశ ఎన్నికల ప్రచారం ముగియగానే మోదీ.. తమిళనాడులోని భగవతీ అమ్మాన్ ఆలయంకు చేరుకున్నారు. అక్కడ బోటులో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవీ చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
మోదీ ధ్యానం చేసిన ప్రదేశం.. వివేకానంద శిలా స్మారకం కన్యాకుమారీ నుంచి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. వసతురాయ్ బీచ్ నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. ఈ ప్రదేశంలో బంగాళా ఖాతం, అరేబియా సముద్రం, హిందు మహా సముద్రంలు ఒకే చోట కలుస్తాయి. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది.