Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఫ్యూచర్‌లో ఇలా ఉండబోతోందా

Fri, 07 Apr 2023-3:29 am,

Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పనుల కోసం కేంద్రం రూ. 720 కోట్ల నిధులు వెచ్చించనుంది.

Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ గురించి ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రైల్వే స్టేషన్ ని రెండు అంతస్తుల్లో నిర్మించి ప్రయాణికులకు అవసరమైన అన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.

Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రయాణికులు తమకు నచ్చిన రవాణా సౌకర్యాన్ని ఎంచుకుని అక్కడి నుంచి తమ తమ స్వస్థలాకు వెళ్లేందుకు వీలుగా అన్నిరకాల రవాణా సదుపాయాలను అనుసంధానం చేయనున్నారు.

Secunderabad Railway Station Redevelopment Design Photos : ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇదే పర్యటనలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా పచ్చ జండా ఊపి ప్రారంభించనున్నారు.

Secunderabad Railway Station Redevelopment Design Photos : మూడు నెలల స్వల్ప వ్యవధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కాబోతోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు, ఇతర ప్రయాణికులకు ఇది ఎంతో మేలు చేకూర్చనుంది.

Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రయాణికులకు కనీసం మూడున్నర గంటల సమయం ఆదా కానుంది.

Secunderabad Railway Station Redevelopment Design Photos : తెలంగాణ పర్యటనలో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 13వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కానుంది.

Secunderabad Railway Station Redevelopment Design Photos : ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్ డిజైన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివిధ దశల వారీగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link