PM Modi: జమ్ములో రెండు రోజుల పాటు మోదీ పర్యటన.. ఈ సారి యోగా డే థీమ్ ఏంటో తెలుసా..?

Thu, 20 Jun 2024-8:55 am,

దేశానికి మోదీ హ్యట్రిక్ గా ఇటీవల ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. కేంద్రమంత్రుకు శాఖలను కూడా కేటాయించారు. అయితే మోదీ ప్రధాని అయ్యాక తొలిసారి ఇటలీకి వెళ్లారు.  అక్కడ జీ7 సమ్మిట్ లో హజరయి, తిరిగి భారత్ కు చేరుకున్నారు. పీఎం అయ్యాక మొదటిసారిగా తన వారణాసికి వెళ్లి..  అక్కడి నుంచి రైతులకు కిసాన్ సమ్మాన్ పథకంకు కింద నిధులను విడుదల చేశారు. 

జూన్ 21 దేశంలో యోగా వేడుకలు జరగనున్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజు జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో పాల్గొంటారు. 

ఈ పర్యటనలో మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో బిజీగా ఉంటారని తెలుస్తోంది. మరోవైపు జూన్ 21న ఉదయం 6:30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే..  ఈ ఏడాది యోగా డే థీమ్ 'యువత మనసు, శరీరంపై యోగా ప్రభావం' ఉంది.

ఇదిలా ఉండగా మోదీ.. 21వ తేదీన దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయనున్నారు. అనంతరం శ్రీనగర్‌లో.. ఎంపవరింగ్ యూత్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ జమ్ము కాశ్మీర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతతో పలు అంశాలపై చర్చిస్తారు.

మోదీ పర్యటన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మోదీ తొలిసారిగా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

ఈక్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ, షాల ద్వయం  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ప్రధాని, బీహర్ లోని రాజ్ గిరిలో నలంద విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు. 

ఈ పునర్నిర్మాణంలో దేశం గొప్ప స్వర్ణయుగం సాధించబోతుందన్నారు. 21 శతాబ్దం భారత్ దే అని మోదీ అన్నారు. ప్రపంచంలోకెల్లా.. భారత్ లోనే అధునాతన, పరిశోధన పరమైన విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని మోదీ అన్నారు. 

విద్యార్థులు ఎల్లప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకొవడం పట్ల ఆసక్తిగా ఉండాలని, ధైర్యసాహసాహాలతో ముందుకు వెళ్లాలని మోదీ పిలుపు నిచ్చారు. ఇటీవల ఉగ్రదాడులు నేపథ్యంలో అధికారులు కూడా జమ్ములో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link