Pm modi: 45 గంటల పాటు ధ్యానంలో మోదీ.. ఆయన తీసుకునే ఆహరం ఏంటంటే..?

Fri, 31 May 2024-12:35 pm,

నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని వివేకానంద  శిలాస్మారకం వద్దకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన మెడిటేషన్ లో నిమగ్నమయ్యారు. స్వామి వివేకానంద కూడా గతంలో ఇక్కడ మూడు రోజుల పాటు మెడిటేషన్ చేశారని చెప్తుంటారు.   

మోదీ ధ్యానం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారో అని ఆయన అభిమానులు  ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. మోదీ 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో విరామం ఇస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.   

విరామం సమయంలో కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుంటారని సమాచారం. అదే విధంగా ఆయన ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్ గా మౌనంతో ఉంటారని కూడా తెలుస్తోంది.  

ప్రస్తుతం కాషాయ దుస్తుల్లో ఉన్న మోదీ చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. మోదీ సూర్య నమస్కారాలు చేసి, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి తన మెడిటేషన్ ను ప్రారంభించారు. 

చివరి దశ ఎన్నికలకు ముందు మోదీ మెడిటేషన్ లో కూర్చున్నారు. జూన్ 1 సాయంత్రం వరకు కూడా ఆయన ధ్యానమండపంలోనే ఉంటారని తెలుస్తోంది. ఇక్కడ 1892 లో స్వామి వివేకానంద కూడా ధ్యానం చేసిన ప్రదేశం కూడా ఇదే. 

అంతకు ముందు మోదీ భగవతి అమ్మన్ ఆలయంకు వెళ్లారు. అక్కడ సాంప్రదాయ దుస్తులలో మోదీ అమ్మవారిని దర్శించుకున్నారు. 108 శక్తిపీఠాలలో భగవతి అమ్మాన్ ఆలయం కూడా ఒకటని చెబుతుంటారు.

అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మోదీ.. స్పెషల్ బోటులో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపానికి చేరుకున్నారు. ధ్యానమండపంలో స్వామి వివేకనంద, భగవాన్ రామకృష్ణ పరమహంస విగ్రహాల ఎదుట ప్రార్థనలు చేశారు. 

ప్రధాని మోదీ బసచేసిన వివేకానంద శిలా స్మారకం కన్యాకుమారీ నుంచి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడికి మనం వసతురాయ్ బీచ్ నుంచి చేరుకోవచ్చు.ఈ ప్రదేశంలో బంగాళా ఖాతం, అరేబియా సముద్రం, హిందు మహా సముద్రంలు ఒకే చోట కలుస్తాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link