POCO C75 Price: రూ.9వేలకే 5160mAh బ్యాటరీతో POCO C75 మొబైల్‌ లాంచ్‌.. దీన్ని కొట్టే మొబైల్ రాదు ఇంకా!

Wed, 23 Oct 2024-1:14 pm,

ఈ POCO C75 స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అక్టోబర్‌ 25వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అతి తక్కువ ధరలో ఈ మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

POCO C75 మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఇందులో కంపెనీ ఫీచర్స్‌తో పాటు ధరను హైలెట్ చేస్తూ విడుదల చేసింది. ఈ Poco C75 స్మార్ట్‌ఫోన్‌ 6.88 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది.   

అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 5160mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 50-మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభించనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో రౌండ్‌ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది.   

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రెండు విభిన్న స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌, రెండవది 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.  

ఇది POCO C75 మొబైల్‌ సైడ్ ఫేసింగ్‌ ప్రింట్‌ స్నానర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 3.5 mm ఆడియో జాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,100 నుంచి ప్రారంభం కాబోతోంది..  

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని రెండవ వేరియంట్‌ ధర రూ.10,850 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది సిల్వర్‌తో పాటు గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link